విజయ్ దేవరకొండ, ఆనంద్ రంగ కాంబినేషన్ లో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ నోటా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ అనిపించేసింది. ఇక ఈ సినిమా ట్రైలర్ బాగున్నా టైటిల్ పోస్టర్ విషయంలో నెటిజెన్లు ఆగ్రహంగా ఉన్నారు. సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.
అలానే ట్రైలర్ కూడా ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేశారు. తమిళ పోస్టర్ లో తమిళంలో టైటిల్ పెట్టారు. కాని తెలుగులో మాత్రం ఇంగ్లీష్ లో టైటిల్ వేశారు. ఇదే నెటిజెన్లకు కోపాన్ని తెప్పిస్తుంది. తెలుగు భాష అంటే అంత చులకన ఎందుకు.. తెలుగులో టైటిల్ ఎందుకు వేయలేదని ట్రోలింగ్ చేస్తున్నారు.
రౌడీ హీరో విజయ్ ఎలా ఇలాంటివి పట్టించుకోడు అంతేకాదు ఇలాంటి వివాదాల వల్ల సినిమాకు మరింత పబ్లిసిటీ వస్తుంది. అర్జున్ రెడ్డి టైంలో కూడా ఇలానే లిప్ లాక్ రచ్చ చేయగా సినిమా కలక్షన్స్ తో దుమ్ముదులిపేసింది.