నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తనయుడైన నందమూరి హరికృష్ణ నటుడిగా కొనసాగుతన్న సమయంలోనే తండ్రి స్థాపించిన తెలుగు దేశం పార్టీ వ్యవహారాలు చూస్తూ..తండ్రికి ఎంతో అండదండగా ఉన్నారు. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా చైతన్య రథాన్ని నడుపుతూ ఆన్నీ తానై చూసుకున్నారు. మద్య వయసులో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో లాహిరి లాహిరి లాహిరలో, సీతయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన సత్తా చాటారు.
ఎంపీగా కొనసాగిన ఆయన రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో సింహంలా గర్జించారు. తెలుగు భాషలోనే మాట్లాడుతూ..తెలుగు భాష గొప్పతనాన్ని చాటారు. డ్రైవింగ్ పై ఎంతో పట్టు ఉన్న ఆయన డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణంచడం ఊహలకందని విషయం. నందమూరి హరికృష్ణ మరణం తెలుగు ఇండస్ట్రీ తో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతుంది.
ఇక నందమూరి హరికృష్ణతో ఎంతో అనుబంధం ఉన్న కళ్యాన్ రామ్, జూ. ఎన్టీఆర్ ల బాధ వర్ణణాతీతం. ఇప్పటికే హరికృష్ణగారి మృతి పై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే సూపర్ స్టార్ మహేష్‌బాబు శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో మెహిదీపట్నం, ఎన్‌ఎండీసీ సమీపంలోని హరికృష్ణ నివాసానికి వచ్చిన ఆయన నందమూరి కుటుంబాన్ని ఓదార్చి తన సంతాపాన్ని తెలిపారు.
దాదాపు గంట సేపు వరకు నందమూరి కుటుంబ సభ్యులతో ఉన్న ఆయన నందమూరి హరికృష్ణ మంచి నటుడే కాదు మంచి మనసు ఉన్న వ్యక్తి అని..స్నేహానికి ఎంతో విలువు ఇచ్చే మనిషి అని..ముఖ్యంగా అభినులను కనిపించే దేవుళ్లు అంటూ సంబోధించే వారని..అంత గొప్ప మనిషి మన మద్య లేకపోవడం..ఆయన లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరని అన్నారు. సందర్భంగా హరికృష్ణతో తన అనుబంధాన్ని నెమరువేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.