జన్మాష్టమి సందర్భంగా ఈరోజు ప్రజలంతా కృష్ణుడి పూజ చేస్తారు. ఆబాలగోపాలాన్ని తన అల్లరి చేష్టలతో అలరించి తను చేసే ప్రతి వెనుక ఓ అర్ధం పరమార్ధం ఉందని చెప్పిన శ్రీకృష్ణుడి లీలలు అన్ని ఇన్ని కావు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆయన ధర్మ, అధర్మాలను సైతం పక్కన పెట్టారు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీ కృష్ణుడు జన్మిస్తాడు.
ఈ రోజున భక్తులంతా భక్తి శ్రద్ధలతో కృష్ణుడిని పూజిస్తారు. ఇక ఈరోజు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే ఈరోజు తులసి ఆకులను తుంచకూడదు. తులసి ఆకులను ఈరోజు కోయరాదు. అయితే విష్ణు పూజకై కోస్తే తప్పేం ఉండదు.
ఇక ఈరోజు పేదవారిని అగౌరవ పరచకూడదు. కృష్ణుడు స్నేహితుడు సుధాముడు పేదవాడే అయినా అతనంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఇక ఈరోజు చెట్లను కూడా నరకకూడదు. అంతేకాదు మనం ఈరోజు ఎవరికి హాని తలపెట్టే ఆలోచన కూడా చేయకూడదని చెబుతున్నారు.
జన్మాష్టమి నాడు మాసాహారాన్ని తీసుకోరాదు.. మద్యం కూడా సేవించకూడదు. ఇక ఈరోజు భౌతిక సంబంధాలకు దూరం గా ఉండాలి. పవిత్రమైన హృదయమతో కృష్ణుడిని పూజిస్తే మంచి జరుగుతుంది.
కృష్ణాష్టమి స్పెషల్.. పూజా విధానం.. చేయకూడని పనులు..!

Html code here! Replace this with any non empty raw html code and that's it.