Gossipsనందమూరి కుటుంబానికి ఎన్.టి.ఆర్ వారసుడవుతాడా..!

నందమూరి కుటుంబానికి ఎన్.టి.ఆర్ వారసుడవుతాడా..!

ఒక్క సినిమా రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా నందమూరి ఫ్యామిలీ చరిష్మా తెలిసిందే. అన్న ఎన్.టి.ఆర్ చూపించిన బాటలో నందమూరి నారా ఫ్యామిలీలు నడుస్తున్నాయి. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షానే ఉంటూ వస్తుంది. ఇక ఈమధ్య అకాల మరణం చెందిన హరికృష్ణ వల్ల మళ్లీ నందమూరి ఫ్యామిలీలో కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్న వారసత్వ రగడ మొదలైంది.
6
ఎన్.టి.ఆర్ తనయులుగా ఉన్న నలుగురిలో ఎప్పుడు వారసత్వ గొడవ లేదు. ఎన్.టి.ఆర్ రాజకీయ వారసత్వాన్ని ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు తీసుకుంటే.. సినిమాల పరంగా బాలకృష్ణ ఆ ప్రస్థానం కొనసాగించాడు. అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో అన్న గారి ఆలోచనలకు సపోర్ట్ గా ఉన్న వ్యక్తి నందమూరి హరికృష్ణ.
5
పెళ్లి భార్యతో పాటుగా ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. వారి సంతానంగానే ఎన్.టి.ఆర్ పుట్టాడు. హరికృష్ణ రెండో పెళ్లి గురించి ఎన్.టి.ఆర్ కు తెలిసి జూనియర్ ఫ్యామిలీని చేరతీశాడు. అయితే మిగతా నందమూరి ఫ్యామిలీ మాత్రం అసలు పట్టించుకోలేదు సరికదా కొన్నాళ్ల వరకు అసలు గుర్తింపు ఇవ్వలేదు. కాని ఎప్పుడైతే జూనియర్ ఎన్.టి.ఆర్ తాత పోలికలతో నవరస నటన ప్రతిభతో వచ్చాడో నందమూరి ఫ్యాన్స్ ఆయనకు ఫిదా అయ్యారు.
4
రెండో పెళ్లి అయినంత మాత్రానా వారిని తక్కువ చూడాల్సిన అవసరం ఏముంది. హరికృష్ణ మొదటి భార్య కొడుకైన కళ్యాణ్ రాం కన్నా నందమూరి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు ఎన్.టి.ఆర్. అందుకే అతనికి స్టార్ ఇమేజ్ వచ్చింది.
2
ఇన్నాళ్లు తండ్రి హరికృష్ణ ఉన్నాడు కాబట్టి నందమూరి ఫ్యామిలీ అండ ఉన్నా లేకున్నా తారక్ నిలబడగలిగాడు. మరి రానున్న రోజుల్లో నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ జూనియర్ కు ఉంటుందా.. ఆ మాటకొస్తే ఇటు సినిమాలు అటు రాజకీయాల్లో సత్తా చాటగలిగే ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్.టి.ఆరే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
3
నందమూరి ఫ్యామిలీకి అసలు సిసలు వారసుడు ఎన్.టి.ఆర్ అవుతాడా లేదా అన్నది చూడాలి. కొన్నాళ్లు బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ను దూరం పెట్టాలని ప్రయత్నించగా హరికృష్ణ మరణం బాబాయ్ అబ్బాయ్ లను ఒకటి చేసింది.
1

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news