Moviesనాగార్జున, నాని " దేవదాస్ " రివ్యూ & రేటింగ్

నాగార్జున, నాని ” దేవదాస్ ” రివ్యూ & రేటింగ్

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేసిన మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

సరదాగా జీవితాన్ని సాగిస్తున్న దాసు (నాని) డాక్టర్ వృత్తిలో ఉంటాడు. అతని దగ్గరకు అనుకోకుండా వస్తాడు డాన్ దేవా (నాగార్జున). తన శత్రువు దాదా (శరత్ కుమార్) అతని కొడుకు నవీన్ చంద్రతో పాటుగా డేవిడ్ (కునాల్ కపూర్) దేవాని టార్గెట్ చేస్తారు. వారి నుండి తప్పించుకుని దాసు దగ్గరకు చేరతాడు దేవ. మరో పక్క పూజా (రష్మిక)తో లవ్ ప్రాబ్లెం లో ఉంటాడు దాసు. దేవా కూడా జాహ్నవి (ఆకాంక్ష సింగ్)కు కనెక్ట్ అవుతాడు. ఇలా వారి ప్రేమతో పాటుగా తమని వెంటాడుతున్న శత్రువుల మీద ఎలా గెలిచారన్నది సినిమా కథ.
2
నటీనటుల ప్రతిభ :

నాగార్జున, నానిల పర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. నాగార్జున ఎప్పటిలానే ఎవర్గ్రీన్ క్రేజీ లుక్ తో కనిపించారు. ఇక నాని నాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్స్ రష్మిక, ఆకాంక్ష సింగ్ ఇద్దరు చాలా బాగా అలరించారు. ఇక సినిమాలో శరత్ కుమార్, కునాల్ కపూర్, నవీన్ చంద్ర కూడా బాగానే చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

శాందత్ సాయినుద్ధీన్ సినిమాటోగ్రఫీ బాగుంది.. సినిమా చాలా కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాకు కావాల్సిన మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదరగొట్టాయి. దర్శకుడు శ్రీరాం ఆదిత్య తన ప్రతిభ చాటుకున్నాడు. కథ కథనాల్లో కామెడీ చొప్పించి ఆద్యంతం సినిమా వినోదభరితంగా తెరకెక్కించాడు.
1
విశ్లేషణ :

మల్టీస్టారర్ సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడటం కామన్ అయితే ఈ సినిమాకు అలాంటి అంచనాలు ఉన్నా సినిమా మొత్తం కామెడీగా ఉంటుందని ట్రైలర్ లోనే చూపించారు. కథ అంత కొత్తగా ఏం లేకున్నా కథనం అంతా సరదాగా నడిపించిన తీరు బాగుంటుంది.

సినిమాలో నాగ్, నానిల స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఇద్దరు చాలా ఎనర్జిటిక్ గా అనిపించారు. కథనం చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. రాసుకున్న కథకు తగినట్టుగా ఆడియెన్స్ ను మెప్పించేలా ఉంది. ఇక సినిమాలో కామెడీ హాయిగా ఉంటుంది. ఇద్దరి హీరోల క్యారక్టరైజేషన్ బాగా రాసుకున్నాడు దర్శకుడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించేలా ఈ దేవదాస్ లు వచ్చారు.

ప్లస్ పాయింట్స్ :

నాగ్, నాని

సినిమాటోగ్రఫీ

కామెడీ

మైనస్ పాయింట్స్ :

ముందే తెలిసేలా కథనం

సెకండ్ హాఫ్

సాంగ్స్

బాటం లైన్ :

దేవదాస్ లు.. మెప్పించేశారు..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news