జగిత్యాలలో జరిగిన బస్సు యాక్సిడెంట్ జన హృదయాలను కలిచి వేస్తుంది. కొద్ది క్షణాల్లో గమ్యస్థానం చేరుకోవాల్సిన ప్రాణాలన్ని గాల్లో కలిసిపోయాయి. కొండగట్టు బస్సు ప్రమాదంలో వెలుగు చూసిన నిజాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ప్రమాదంలో పాలుపంచుకున్న బాధిత 13 ఏళ్ల అర్చన చెప్పిన నిజాలను బట్టి చూస్తే బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తుంది.
డ్రైవర్ ఆల్రెడీ బ్రేక్ ఫెయిల్ అయ్యిందని గమనించి అందరిని కిటీకీల్లోంచి దూకమని గట్టిగా కేకలు వేశాడట. కొందరు అలా దూకగా మరికొందరు బస్సులోనే ఉన్నారట. అంతేకాదు ప్రమాదంలో తన తల్లి కూడా ఉందని ఆమె మరణించిందని అర్చన వెళ్లడించింది. దాదాపు ఈ ప్రమాదంలో 60 మంది మృత్యువాత పడ్డారు.
మృతులలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తుంది. కొండగట్టు దారిపై అవగాహన లేని డ్రైవర్ వల్లే ఈ విపత్తు జరిగిందని అంటున్నారు. పోయిన ప్రాణాలు ఎలాగు తిరిగి రావు కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.
కొండగట్టు ప్రమాదంలో కొత్త కోణం..నిజాలు బయటపెట్టిన బాధిత బాలిక!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి