Movies" C/o కంచరపాలెం " రివ్యూ & రేటింగ్

” C/o కంచరపాలెం ” రివ్యూ & రేటింగ్

మారిన ఆడియెన్స్ ఆలోచన ధోరణి ప్రకారంగా దర్శక నిర్మాతలు కూడా కొత్త కథలను ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా అంటే ఇదే ఫార్మెట్ లో తీయాలన్న సమీకరణాలను పక్కన పెట్టేసి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి ప్రయోగాల్లో ఒకటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కేరాఫ్ కంచరపాలెం. అంతా కొత్త వాళ్లతో వెంకటేష్ మహా చేసిన ప్రయత్నమే ఈ సినిమా. రానా దగ్గుబాటి రిలీజ్ చేసిన ఈ సినిమా విజయ ప్రవీణ పరుచూరి నిర్మించారు.

కథ :

సుందరం (కేశవర కర్రి), సునీత (నిత్య శ్రీ) స్కూల్ ఏజ్ లవ్.. జోసెఫ్ (కార్తిక్ రత్నం), భువనేశ్వరి (ప్రణీతా పట్నాయక్) టీనేజ్ లవ్.. గడ్డం (మోహన్ భగత్), సలీమా (విజయ ప్రవీణ) వెరైటీ లవ్ స్టోరీ. 49 ఏళ్లున్నా పెళ్లి కాని రాజు (సుబ్బారావు), తన కొలీగ్ రాధ (రాధా బెసీ) ఇలా అందరు వారి వారి ప్రేమ కోసం ఏం చేశారు. వీరందరికి క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చిన సర్ ప్రైజ్ ఏంటి అన్నది సినిమా కథ.
3

4
నటీనటుల ప్రతిభ :

సినిమాలో నటించిన వారంతా చాలా సహజంగా చేశారు. దాదాపు ఈ సినిమ ద్వారా 50 మంది కొత్త వారు పరిశ్రమకు పరిచయం అయ్యారు. నాలుగు జంటల్లో నటించిన వారంతా కొత్త వారు కావడం విశేషం. అందరు ఫన్ జెనరేట్ చేస్తూ సినిమాకు చాలా ప్లస్ అయ్యారు.

సాంకేతిక వర్గం పనితీరు :

స్వీకర్ అగస్థి మ్యూజిక్ బాగుంది. సినిమాకు బిజిఎం బాగా ఇచ్చాడు. వరుణ్, ఆదిత్యల సినిమాటోగ్రఫీ సినిమాకు హెల్ప్ అయ్యింది. నాచురల్ లొకేషన్స్ లో షూట్ చేయడం ప్లస్ అయ్యింది. కథ, కథనాలు చాలా నార్మల్ గా సహజంగా ఉండటం సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత కావాలో అంత పెట్టేశారు.

విశ్లేషణ :

టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అంటే ఏదో అద్భుతాలు చేయనవసరం లేదు.. మన దగ్గర ఉన్న కథతో ప్రేక్షకులను ఎలా మెప్పించాలో తెలియాలి. అలాంటి క్రేజీ అటెంప్ట్ కేరాఫ్ కంచరపాలెం అని చెప్పొచ్చు. సినిమా అంతా చాలా సహజంగా సాగుతుంది. చూస్తున్న కొద్ది క్షణాల్లోనే ఆ సినిమాలో లీనమవుతారు.

ఇక ఆర్టిస్టులంతా చాలా నేచురల్ గా నటిస్తూ మెప్పించారు. లైవ్ రికార్డింగ్ కాబట్టి డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ కలిగించాయి. ఈమధ్య కాలంలో ఇంత రియలిస్ట్ సినిమాలు రాలేదని చెప్పొచ్చు. ప్రేమకథలతో వచ్చిన ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా ఉంటుంది.

ఇక కథ, కథనాలు దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన్ విధానం బాగుంది. కామెడీ, ఎమోషన్ రెండు క్యారీ చేస్తూ వచ్చాడు. పతాక సన్నివేశాల్లో సినిమా ఆడియెన్స్ ను టచ్ చేస్తుంది. సినిమా మొత్తం ఒక ఎత్తైతే క్లైమాక్స్ మరో ఎత్తు. యూత్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయితే సినిమా వేరే రేంజ్ కు వెళ్తుంది. రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసే వారికి ఇది నచ్చకపోవచ్చు.
2

1
ప్లస్ పాయింట్స్ :

ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్

సహజత్వం

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

కమర్షియల్ ఎలిమెంట్స్

బాటం లైన్ :

కేరాఫ్ కంచరపాలెం మంచి అనుభూతి ఇచ్చే సినిమా..!

రేటింగ్ : 3.25/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news