క్రిష్ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. తేజ నుండి క్రిష్ చేతుల్లోకి వచ్చిన ఈ సినిమాలో కాస్టింగ్ అదిరిపోయింది. ఇక సినిమాలో చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
బాబుగా రానా అచ్చు గుద్దినట్టు కుదిరాడని చెప్పొచ్చు. ఈ పాత్ర కోసం రానా మేకోవర్ అద్భుతం. సిని వర్గాలు ఆశ్చర్యపడేలా చంద్రబాబుగా రానా అదరగొట్టాడు. రీసెంట్ గా బాలకృష్ణ ఫస్ట్ లుక్ మాత్రమే కాదు నేడు వచ్చిన రానా లుక్ కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ పై మరింత అంచనాలు పెంచింది.
క్రిష్ డైరక్షన్ లో గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ అందుకున్న బాలకృష్ణ ఆ సినిమాను మించేలా ఎన్.టి.ఆర్ బయోపిక్ తీస్తున్నారని చెప్పొచ్చు. జనవరిలో రిలీజ్ అనుకుంటున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
బాబుగా మారిన భల్లాలదేవుడు..సిని వర్గాలను ఆశ్చర్యపరుస్తున్న క్రిష్..!

Html code here! Replace this with any non empty raw html code and that's it.