కొన్నాళ్లుగా బాబాయ్, అబ్బాయ్ లైన బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య సన్నిహిత సంబంధాలు లేవు అన్నది అందరికి తెలిసిన విషయమే. హరికృష్ణ మరణంతో అందరు ఒకటయ్యారు. నందమూరి ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలుస్తున్న బాలకృష్ణ అన్న కొడుకులైన కళ్యాణ్ రాం, ఎన్.టి.ఆర్ లకు తగిన సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ నటిస్తున్న అరవింద సమేత ఆడియోకి బాలకృష్ణ వస్తున్నాడని హడావిడి చేస్తున్నారు.
బాలకృష్ణ వస్తే నందమూరి ఫ్యాన్స్ కు అంతకుమించిన ఆనందం మరోటి ఉండదు. అయితే ఈ విషయంలో ఎన్.టి.ఆర్ మీదే బాధ్యత పెట్టేశారట దర్శక నిర్మాతలు. ఇక ఎన్.టి.ఆర్ కూడా బాబాయ్ ఇష్ట పూర్వకంగా వస్తానంటే ఆయన చెప్పిన డేట్ కే ఆడియో పెట్టుకోవాలని చూస్తున్నారట. ఓ పక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ లో బిజీగా ఉన్న బాలయ్య అసలు తనకు కుదురుతుందో లేదో అని తెలుసుకుని డేట్ ఫిక్స్ చేద్దామని అంటున్నాడట.
అసలైతే సెప్టెంబర్ 20, 22లలో అరవింద సమేత ఆడియో అనుకుంటున్నారు. ఒకవేళ అనుకున్నట్టుగానే ఎన్.టి.ఆర్ కోసం బాలకృష్ణ వస్తేన్ కనుక ఇక ఆ వేడుక చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ రెండు కళ్లు సరిపోవని చెప్పొచ్చు.
బాలయ్య ఆలోచన మేరకే ఎన్.టి.ఆర్ నెక్స్ట్ స్టెప్..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి