యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా విశ్వరూపం సినిమా సీక్వల్ గా వచ్చిన మూవీ విశ్వరూపం-2. కమల్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
విశ్వరూపం-2 కథ పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడ నుండో మొదలుపెట్టాడు. విసాం (కమల్ హాసన్), ఒమర్ (రాహుల్ బోస్) అమెరికా నుండి ఇండియాకు వస్తారు. విసాం ఫ్యామిలీ మీద ఒమర్ కన్నేస్తాడు. భార్య నిరుపమ (పూజా కుమార్) మదర్ విసాం మహ్మద్ ను కాపాడేందుకు పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తాడు విసాం. ఒమర్, విసాం క్యాట్ అండ్ మౌజ్ రేస్ లా ఉంటుంది. చివరకు విసాం ఒమర్ ను ఎలా ఎదుర్కున్నాడు. అతని సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకూల్చాడు అన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
కమల్ హాసన్ విసాం అహ్మద్ కాశ్మిరి పాత్రలో అదరగొట్టాడు. మొదటి పార్టులో ఉన్న ఎనర్జీని కంటిన్యూ చేశాడు. రాహుల్ బోస్ విలనిజం బాగుంది. పూజా కుమార్, ఆండ్రియా ఇద్దరు ఇంప్రెస్ చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు :
సను వర్గేస్ కెమెరా వర్క్ బాగుంది. యాక్షన్ సీన్స్ లో బాగా వర్క్ అవుట్ చేశారు. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. గిబ్రన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కథ, కథనాల్లో కమల్ హాసన్ తన ప్రతిభ చూపించినా ఈసారి వర్క్ అవుట్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
విశ్లేషణ :
విశ్వరూపం ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడ నుండో సినిమా తీసుకోవడం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అయితే కథను కొనసాగించిన తీరు ఆకట్టుకోలేదు. కథనం కూడా సోదిగా అనిపిస్తుంది. మొదటి భాగం మొత్తం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఒక్కటంటే ఒక్క సీన్ ఇంప్రెస్ చేయలేదు.
అయితే కాస్త కూస్తో సెకండ్ హాఫ్ బెటర్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. కమల్ ఈ వయసులో ఆ రేంజ్ యాక్షన్స్ స్టంట్స్ చేయడం గొప్ప విషయం. సినిమాలో ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఏ సీన్ లేదు. అంతా చప్పగా సాగుతుంది. మొదటి పార్టు మీద ఉన్న ఇంప్రెషన్ కొద్ది ఈ పార్ట్-2 చూడాలని వెళ్లిన వారికి నిరాశ తప్పదు. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు.
ప్లస్ పాయింట్స్ :
కమల్ హాసన్
సినిమాటోగ్రఫీ
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
స్లో నరేషన్
బాటం లైన్ :
విశ్వరూపం-2.. నిరాశ పరచిన ప్రయత్నం..!
రేటింగ్ : 2/5