కమల్ హాసన్ దర్శక నిర్మాతగా నటించిన సినిమా విశ్వరూపం. ఆ సినిమాకు సీక్వల్ గా వచ్చిన విశ్వరూపం-2 సినిమా మొదటి రోజే భారీ దెబ్బ పడ్డది. తెలుగులో ఆల్రెడీ నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కేరళలో వరుణుడు దెబ్బ వేశాడు. కేరళలో భారీగా రిలీజ్ అయిన విశ్వరూపం-2 అక్కడ భారీ వర్షాల కారణంగా అస్థవ్యస్థంగా మారింది.
అధికారులు ఇళ్ల నుండి ఎవరు బయటకు రావొద్దని ఆదేశాలు జారిచేశారు. లోతట్టు ప్రాంతాలన్ని నీటిమయమయ్యాయ్. కమల్ విశ్వరూపం-2 మీద ఈ ఎఫెక్ట్ భారీ పడ్డది. ఐదేళ్లు ఎదురుచూసి రిలీజ్ చేసిన ఈ సినిమా మళ్లీ కమల్ హాసన్ కు నష్టాలే మిగిలిచింది. తన మార్క్ ప్రమోషన్స్ చేసినా సరే ప్రకృతి వల్ల తన సినిమాకు నష్టం వాటిల్లింది. కేరళలో ఇక విశ్వరూపం-2 కష్టమే అంటుండగా తెలుగులో కూడా టాక్ బాగాలేదు కాబట్టి కమల్ కు నిరాశ తప్పేలా లేదని అంటున్నారు.
కేరళ రాష్ట్రంలో లాగానే తమిళ్ నాడు లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురవడంతో ఈ సినిమాకి కొత్త సమస్యలు తెచ్చి పెట్టాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు ఇంటి నుండి బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. ఇది చాలదు అన్నట్టు సినిమాకి కొంత నెగటివ్ టాక్ రావటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఇక రెండు రోజుల క్రితం కరుణానిధి మరణించటం తో తమిళ ప్రజలు తీవ్ర ద్రిగ్భ్రాంతి చెందిన విషయం తెలిసందే. ఇది కూడా ఈ సినిమాకి కొంత మైనస్ గా మారింది.
https://www.telugulives.com/telugu/viswaroopam2-review-and-rating/