హింది సీరియల్స్ లో నటించి పంజాబి సినిమాల్లో బిజీగా ఉన్న పాయల్ రాజ్ పుత్ ను తెలుగులో ఆరెక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా తీసుకొచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమాలో అమ్మడి అందాల ప్రదర్శన, అదరచుంభనాలు తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. అందుకే సినిమా మంచి వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అందుకుంది.
తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా ఓ తెలుగు నిర్మాత నుండి కమిట్మెంట్ మాట వినపడి షాక్ అయ్యిందట. తమ సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పిన ఆ నిర్మాత కాంప్రమైజ్ ప్రపోజల్ తెచ్చాడట. దానితో అమ్మడికి చిర్రెత్తుకొచ్చి అతడిని బండ బూతులు తిట్టిందట.
కాస్టింగ్ కౌచ్ మీద ఓ పక్క రకరకాల వాదనలు వినిపిస్తుండగా సక్సెస్ లో ఉన్న హీరోయిన్నే ఇలా కాంప్రమైజ్ అడిగారంటే కొందరు దర్శక నిర్మాతలు ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.