2019లో తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం అప్పుడే వ్యూహాలు రచిస్తున్నారు పార్టీ శ్రేణులు. ఎవరి గెలుపుపై వారు ధీమాగా ఉండటమే కాకుండా ప్రతిపక్ష పార్టీలను ఉతికారేస్తూ జనాల్లో తమ పాపులారిటీ పెంచుకునేందుకు ప్లాన్‌లు వేస్తున్నారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు అందరి చూపు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్‌పై ఉంది. పోయినసారి టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ ఈసారి బరిలోకి డైరెక్ట్‌గా వస్తుండటంతో భారీ రాజకీయ మార్పు చోటుచేసుకోనుందని అంటున్నారు విశ్లేషకులు.
కాగా టీడీపీ ఎంఎల్‌ఏ మరియు నటుడు నందమూరి బాలకృష్ణ కూడా ఈసారి అదిరిపోయే విధంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాడు. ఇప్పటికే పార్టీ శ్రేణులతో ప్రత్యేక చర్చలు జరుపుతూ భారీ బహిరంగ సభలలో తమ పార్టీ విజయం కోసం చాలా కష్టపడుతున్నాడు బాలయ్య. ఈ క్రమంలో ఆయన జనసేప పార్టీ మరియు పవన్ కళ్యాణ్‌పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో జనసేన పార్టీ మీటింగులకు జనాలు భారీ సంఖ్యలో రావడంపై బాలయ్య స్పందన ఏమిటి అని అడగ్గా.. పవన్ కళ్యాణ్ మీటింగ్స్‌కు ఎంత మంది వస్తున్నారో తనకు తెలియదని.. అలగా జనం వచ్చే మీటింగుల గురించి తాను పెద్దగా పట్టించుకోనంటూ బాలయ్య స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.
ఇప్పుడు ఇదే టాపిక్ జనసేన అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. పార్టీలోని కొంతమంది నాయకులు బాలయ్య వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. కానీ బాలయ్య చేసిన కామెంట్స్‌పై పవన్ నోరు మెదపడం లేదు. దీంతో బాలయ్య అంటే పవన్‌కు భయం పట్టుకుందంటూ టీడీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నారు. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల వేడి తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే మొదలయ్యింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.