సంపత్ నంది నిర్మాణంలో ఆయన రచన అందించిన సినిమా పేపర్ బాయ్. సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా నటించిన ఈ సినిమాను జయశంకర్ డైరెక్ట్ చేశారు. లవ్ స్టోరీగాగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
రాజ కుటుంబలో పుట్టిన దరణి (రియా సుమన్), ఆటో డ్రైవర్ కొడుకైనా ఇంజినీరింగ్ చేస్తూ పార్ట్ టైం గా పేపర్ వేస్తూ పెరిగిన రవి (సంతోష్ శోభన్) ఇద్దరూ వారి అభిప్రాయాలు కలవడంతో ప్రేమించుకుంటారు. వీరి ప్రేమకు ధరణి తండ్రి కూడా ఒప్పుకుంటాడు. అయితే అనుకోకుండా ఈ ఇద్దరు విడిపోతారు. వీరు విడిపోవడంలో ముంబై లో ఉండే మేఘా (తన్య హోప్)కు ఏంటి సంబంధం..? వారిద్దరు ఎందుకు దూరమయ్యారన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
రవిగా సంతోష్ శోభన్ ఇంప్రెస్ చేశాడు. రెండో సినిమానే అయినా సంతోష్ శోభన్ అదరగొట్టాడు. రియా సుమన్ కూడా బాగా అలరించింది. లీడ్ కాస్ట్ ఇద్దరు తమ నటనతో మెప్పించారు. ఇక మరో హీరోయిన్ తన్య హోప్ సినిమాలో నిడివి తక్కువ ఉన్న పాత్ర అయినా ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.
సాంకేతికవర్గం పనితీరు :
సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. భీమ్స్, బొబ్బిలి సురేష్ కలిసి సినిమాకు మంచి మ్యూజిక్ అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ లో సంపత్ నంది సినిమా కథకు ఎంత కావాలో అంతా పెట్టేశారు. కథ, కథనాల్లో దర్శకుడు జయశంకర్ పర్వాలేదు అనిపించాడు. కథ రొటీన్ గా అనిపించినా కథనంలో కాస్త ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ బాగున్నాయి.
విశ్లేషణ :
పేపర్ బాయ్ వేసే హీరో.. పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది.. ఇలాంటి కథలతో సినిమాలు చాలానే వచ్చాయి. రొటీన్ కథ అయినా ఎక్కడ బోర్ కొట్టించలేదు. అయితే కథనంలో కాస్త నెమ్మదనం సినిమాకు మైనస్ అయ్యింది. సినిమాలో కామెడీ అంతగా ఆకట్టుకోలేదు.
సినిమా కథ మరీ రొటీన్ గా అనిపిస్తుంది. మొదటి భాగం అంతా సరదాగా సాగగా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మళ్లీ ఇంప్రెస్ చేశాయి. సినిమాలో డైలాగ్స్ కవితాత్మకంగా ఉంటాయి. ఫైనల్ గా యూత్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేలా పేపర్ బాయ్ వచ్చింది.
ప్లస్ పాయింట్స్ :
సంతోష్, రియా సుమన్
మ్యూజిక్
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
స్టోరీ
నరేషన్
బాటం లైన్ :
పేపర్ బాయ్.. రొటీన్ లవ్ స్టోరీతో వచ్చాడు..!
రేటింగ్ : 2.75/5