Gossipsనాగ శౌర్య " @ నర్తనశాల " రివ్యూ & రేటింగ్

నాగ శౌర్య ” @ నర్తనశాల ” రివ్యూ & రేటింగ్

ఛలోతో సూపర్ హిట్ అందుకున్న నాగ శౌర్య ఈసారి @నర్తనశాల అంటూ ఏ యువ హీరో చేయలేని సాహసాన్ని చేశాడు. శ్రీనివాస్ చక్రవర్తి డైరక్షన్ లో నాగ శౌర్య, కాష్మిరా, యామిని భాస్కర్ లీడ్ రోల్స్ చేసిన సినిమా @నర్తనశాల. ఐరా క్రియేషన్స్ లో పద్మావతి ఈ సినిమా నిర్మించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

తమకు పుట్టేది ఆడపిల్లే అని ఎన్నో కలలు కంటాడు శివాజిరాజా. అయితే అతనికి మగపిల్లాడు పుడతాడు. అయినా సరే అతన్ని ఆడపిల్లలానే పెంచుతారు. తమ ముద్దుకోసం అతనికి ఆడపిల్లల డ్రెస్ వేసి ముద్దు తీర్చుకుంటారు. అలా హీరో పెద్ద అవగా ఈ క్రమంలో ఆడవాళ్ల మీద జరుగుతున్న దాడులను చూసి ఓ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పెడతాడు. అలా ఒక టైంలో మానస (కాష్మిరా)ని కాపాడతాడు. ఇక మరో పక్క సత్య (యామిని భాస్కర్) హీరో నాగ శౌర్యని ఇష్టపడుతుంది. సత్య ఫాదర్ శౌర్యతో ఆమె పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అయితే ఆ పెళ్లినుండి తప్పించుకునేందుకు గే గా నటిస్తాడు నాగ శౌర్య. అతను నిజంగానే నటిస్తున్నాడా..? లేక నిజంగానే గేనా అన్నది అర్ధం కాకుండా చేస్తాడు..? చివరకు సినిమా కథ ఎలా ముగిసిందో తెర మీద చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ :

సినిమాలో గే పాత్ర ఎంచుకోవడం నాగ శౌర్య చేసిన రిస్క్ అని చెప్పొచ్చు. సినిమాలో తన పాత్ర వరకు బాగానే చేశాడు. హీరోయిన్స్ కాష్మిరా, యామిని భాస్కర్ ఆకట్టుకున్నారు. శివాజి రాజా రొటీన్ గానే చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు అన్నట్టు ఉంది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ బాగుంది. అయితే ఛలో సినిమా రేంజ్ పాటలు ఇవ్వలేదని చెప్పాలి. శ్రీనివాస్ చక్రవర్తి కథ, కథనాలు ఏవి అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఐరా క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత ఉష ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని చెప్పొచ్చు.

విశ్లేషణ :

ఛలో సినిమా రొటీన్ కథలా అనిపించినా దానిలో దర్శకుడు నడిపించిన కామెడీ అందరిని మెప్పించింది. ఇక అదే రొటీన్ ఫార్ములాతో ఎంచుకున్న ఓ కథను కేవలం కామెడీతోనే ఆడియెన్స్ ను టార్గెట్ చేశాడు నాగ శౌర్య. ఛలో ఇచ్చిన నమ్మకం అనుకుంటా అసలేమాత్రం కథగా అనిపించని స్టోరీతో నాగ శౌర్య రిస్క్ చేశాడు.

అందులోనూ ఈ సినిమాకు @ నర్తనశాల అన్న గొప్ప టైటిల్ వాడుకున్నాడు. సినిమా టైటిల్ కు క్యారక్టర్ పరంగా జస్టిఫికేషన్ ఇచ్చారే కాని సినిమా ఫలితం మాత్రం కాదు. నాగ శౌర్య ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నాడో అర్ధం కాదు. సినిమా ఏమాత్రం ఆశించిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు సరికదా ఆడియెన్స్ పేషెన్స్ ను టెస్ట్ చేస్తుంది.

కథ, కథనాల్లో దర్శకుడు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఏమాత్రం అంచనాలను అందుకోని @ నర్తనశాల నాగ శౌర్యకు షాకింగ్ రిజల్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

నాగశౌర్య

రెండు సాంగ్స్

మైనస్ పాయింట్స్ :

కథ

కథనం

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

బాటం లైన్ :

మంచి టైటిల్ మిస్ యూజ్ చేసిన నాగ శౌర్య..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news