నందమూరి అభిమానులకు ఉదయాన్నే ఓ చేదువార్త.. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న ఆయన నల్గొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ఎదురుగా వస్తున్న వెహికల్ ను ఢీ కొట్టబోయి పక్కకు తప్పించే క్రమంలో కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో హరికృష్ణ కారులోంచి పక్కన పొలాల్లో పడ్డారు.
హరికృష్ణకు తలకు, చాతి భాగంలో బలమైన గాయాలయ్యాయి. వెంటనే నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ కు తీసుకెళ్లినా హరికృష్ణ ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రాం కూడా నల్గొండ రోడ్డు ప్రమాదంలోనే మరణించడం జరిగింది. హరికృష్ణ మృతి సిని, రాజకీయ పరిశ్రమకు షాక్ ఇచ్చింది. హీరోగానే కాదు మాజీ ఎంపిగా కూడా హరికృష్ణ చేశారు. విషయం తెలుసుకున్న హరికృష్ణ తనయులు ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లు ఇద్దరు నార్కెట్ పల్లికి బయలు దేరినట్టు సమాచారం.