నల్గొండ జిల్లా అన్నెపర్తిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సిని హీరో, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ దుర్మరణం పొందారు. హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న ఆయన ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ ఎక్కించి వాహనాన్ని అదుపు చేయలేక పల్టీలు కొట్టించారు. ఈ ఘటనలో హరికృష్ణ తీవ్ర గాయాల పాలవ్వగా దగ్గరలో ఉన్న నార్కెట్ పల్లి కామినేనికి తరలించారు.
అయితే అప్పటికే తలకు పెద్ద దెబ్బే తగలడం వల్ల హరికృష్ణ స్ప్రుహ కోల్పోయారు. ఇక హాస్పిటల్ కు తీసుకెళ్లిన కొద్దిసేపటికే హరికృష్ణ ఇక లేరని వార్త వినాల్సి వచ్చింది. హరికృష్ణ సడెన్ దెత్ సిని, రాజకీయ నాయకులకు షాక్ ఇచ్చింది. ఇక ఆయన్ను చూసేందుకు సిని రాజకీయ నాయకులతో పాటుగా నందమూరి అభిమానులు కూడా వచ్చేందుకు సిద్ధమయ్యారు.
హాస్పిటల్ నుండి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తీసుకెళ్తారట. అక్కడే ఈరోజు అభిమానుల కోసం కొంత సేపు ఉంచుతారట. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.