వరద పీడిత కేరళకు ఆర్థిక సాయం అందించడం లో తామేం తీసిపోలేదు అంటూ గూగుల్ సంస్థ 7 కోట్లు ప్రకటించింది . ఈ విషయం ఆ సంస్థ ఆఫిసిఅల్ ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటించింది . ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందం న్యూ ఢిల్లీ లో జరిగిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించారు . ఆ 7 కోట్ల సాయం లో సంస్థ యాజమాన్యమే కాక ఉద్యోగుల తోడ్పాటు కూడా ఉండటం విశేషం .
.@Googleorg and Google employees are contributing $1M, to support flood relief efforts in Kerala and Karnataka. #GoogleForIndia@RajanAnandan
— Google India (@GoogleIndia) August 28, 2018
ఆర్ధిక సాయమే కాకా టెక్నాలజీ పరంగా కూడా సాయం చేసింది ఈ సంస్థ . పర్సన్ ఫైండర్ అనే టూల్ ని డెవలప్ చేసి 22000 మందికి సాయపడింది . కేవలం వ్యాపారమే కాకా సమాజం పై భాద్యత కూడా ఉండాలని చాటి చెప్పింది గూగుల్ నేడు .