విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీతా గోవిందం సినిమా కలక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తుంది. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. కథ, కథనాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుండటంతో ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మొదటిరోజే 6 కోట్ల షేర్ వసూళు చేసిన గీతా గోవిందం ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 41 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.
11 కోట్ల థియేట్రికల్ రైట్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 5 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చిపెట్టింది. 26 కోట్ల 67 లక్షల్ షేర్ తో గీతా గోవిందం క్రేజీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాతో హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ కాస్త స్టార్ గా ఎదిగాడని చెప్పొచ్చు. విజయ్ తో పాటుగా రష్మిక ఈ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది.
ఏరియాల వారిగా ఈ సినిమా కలక్షన్స్ చూస్తే..
నైజాం – 6 కోట్ల 70 లక్షలు
సీడెడ్ – 3 కోట్ల 35 లక్షలు
ఊత్తరాంధ్ర – 2 కోట్ల 20 లక్షలు
ఈస్ట్ – 1 కోటి 75 లక్షలు
వెస్ట్ – 1 కోటి 39 లక్షలు
కృష్ణా – 1 కోటి 66 లక్షలు
గుంటూరు – 1 కోటి 74 లక్షలు
నెల్లూరు – 68 లక్షలు
తెలుగు రాష్ట్రాలు మొత్తం 5 రోజుల షేర్ – 19.47 కోట్లు
కర్ణాటక – 1 కోట్లు
తమిళనాడు – 60 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా – 30 లక్షలు
ఇండియా మొత్తం 5 రోజుల షేర్ – 18.67 కోట్లు
యుఎస్ – 3.95 కోట్లు
రెస్ట్ అఫ్ వరల్డ్ – 1 కోటి
ప్రపంచవ్యాప్త 5 రోజుల మొత్తం షేర్ – 26. 67 కోట్లు