విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వచ్చిన మూవీ గీతా గోవిందం. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో వచ్చిన ఈ మూవీని బన్ని వాసు నిర్మించారు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ తో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందం మూఈద చాలా హోప్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ అంచనాలను సినిమా అందుకుందా లేదా అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
తన లవ్ స్టోరీ చెబుతూ ఫ్లాష్ బ్యాక్ మొదలు పెడతాడు గోవిందం (విజయ్ దేవరకొండ). ఆకతాయిగా ఉండే గోవిందం ఓ బస్ జర్నీలో గీతా (రష్మిక)ను చూసి ఇష్టపడి ఆట పట్టిస్తాడు. దానితో గీతకు గోవిందం మీద నెగటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఇక సర్ ప్రైజింగ్ గా గీత బ్రదర్ తోనే గోవిందం సిస్టర్ పెళ్లి జరుగుతుంది. ఇక ఆ టైంలో తన మీద పగ తీర్చుకుంటుంది గీత. సుబ్బరాజు కూడా చెల్లిని బస్ లో ఆటపట్టించిన అతను గురించి వెతుకుతాడు. ఫైనల్ గా గీతాని గోవిందం ఎలా మెప్పించాడు అన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
విజయ్ గోవిందంగా మరో అద్భుతమైన పాత్రలో కనిపించాడు. సినిమా మొత్తం తన భుజాన వేసుకుని చేశాడని చెప్పొచ్చు. గీత పాత్రలో రష్మిక కూడా మెప్పించింది. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. చివర్లో అన్నపూర్ణ పాత్ర అలరించింది. సినిమాలో మిగతా నటీనటులంతా తమ పాత్రల్లో మంచి నటన కనబరిచారు.
సాంకేతికవర్గం పనితీరు :
పరశురాం రొటీన్ స్టోరీతోనే గీతా గోవిందం చేశాడని చెప్పొచు. అయితే హీరో పాత్రని బాగానే రాసుకున్నాడు. కథ, కథనాలు కాస్త రొటీన్ గా అనిపించాయి. గొపి సుందర్ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే సాంగ్స్ మోంటేజ్ మాత్రం బాగాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. డైలాగ్స్ ఇంప్రెస్ చేశాయి.
విశ్లేషణ :
విజయ్ కు ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గోవిందం పాత్ర ఎంచుకున్న తీరు బాగుంది. అయితే అన్ని సినిమాలు అర్జున్ రెడ్డిలు కాలేవు కాబట్టి సినిమా తనవరకు బాగానే చేసినా మిగతా అంతా రొటీన్ గానే అనిపిస్తుంది. కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు.. హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ ఎక్కువగా ఉంటాయి.
అవి కూడా సెకండ్ హాఫ్ అంతా బోరింగ్ గా సాగదీసినట్టు అనిపిస్తుంది. యూత్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసే డైలాగులు, సీన్స్ టీజర్, ట్రైలర్ లో పెట్టడం సినిమా అంతా రొటీన్ గా నింపడం ఈమధ్య సినిమాల్లో చూస్తున్నదే ఆ దారిలోనే గీతా గోవిందం కూడా వచ్చింది. సినిమా మీద ఉన్న అంచనాలకు ఓకే అనేలా ఉంటుంది తప్ప సూపర్ అనేలా ఉండదు.
కేవలం విజయ్ పర్ఫార్మెన్స్ కోసం.. రష్మిక కోసం ఒకసారి చూసేయొచ్చు. పరశురాం ఈ సినిమాలో అంత ప్రతిభ కనబరచలేకపోయాడు. సినిమా రొటీన్ గానే అనిపించినా టైం పాస్ చేసేలా ఉంది. సినిమా అక్కడక్కడ ప్రేమతో రా సినిమా ఫీచర్స్ కనబడతాయి. అయితే అందులో హీరో, హీరోయిన్ ను మోసం చేసి వచ్చేస్తాడు. తీరా చూస్తే హీరో అన్నకి, హీరోయిన్ అక్కకి పెళ్లి అవుతుంది. కొద్దిగా అటుఇటుగా పాయింట్ అలానే ఉంటుందనిపిస్తుంది. ఫైనల్ గా పోటీగా పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం.. ఇండిపెండెన్స్ డే కావడం వల్ల వారాంతరం కల్లా ఈ సినిమా కలక్షన్స్ బాగానే రాబట్టొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
విజయ్ దేవరకొండ
రష్మిక
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
డైరక్షన్
సెకండ్ హాఫ్
బాటం లైన్ : గీతా గోవిందం.. అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి..!
రేటింగ్ : 2.5/5