హరికృష్ణ మరణించడమే పెద్ద షాక్ లా భావిస్తుంటే ఆ బాధ నుండి తేరుకోకముందే మరో దర్శకురాలు మృతి సిని పరిశ్రమను కలచివేస్తుంది. ప్రముఖ దర్శకురాలు బి.జయ గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయారు. ప్రముఖ పిఆర్వో బి.ఏ రాజు భార్య అయిన బి.జయ జర్నలిస్ట్ గా వచ్చి దర్శకురాలిగా తన సత్తా చాటుకున్నారు.
జనవరి 11, 1964 లో జన్మించిన బి.జయ చిన్నతనం నుండి చదువు మీద ఎంతో మక్కువ చూపించే వారట. చెన్నై యూనివర్సిటీలో ఎమే పూర్తి చేసిన ఆమె జర్నలిజం డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతిలో సిని డెస్క్ లో పనిచేశారు. గురువారం రాత్రి గుండెపోటుతో ఆమె మరణించడం జరిగింది. ఆమె మృతి పట్ల సిని పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.