నారా రోహిత్ హీరోగా పరుచూరి మురళి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆటగాళ్లు. రోహిత్ కు ఈక్వల్ గా ఈ సినిమాలో జగపతి బాబు రోల్ ఉంది. క్రైం ఇన్వెస్టిగేషన్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
సినిమా దర్శకుడిగా పనిచేస్తున్న నారా రోహిత్ అతని భార్య (దర్షన బానిక్) మర్డర్ కేసులో అనుమానితుడిగా అరెస్ట్ అవుతాడు. ఆ కేసుని వాదించడానికి ప్రముఖ క్రిమినల్ లాయర్ జెబి (జగపతి బాబు) రంగంలోకి దిగుతాడు. డిసిపి సుబ్బరాజు రోహిత్ ను ఇంటరాగేట్ చేస్తారు. జెబి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రోహిత్, జెబిలు ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తారు. ఫైనల్ గా ఎవరిది పైచేయి అయ్యిందన్నది సినిమా కథ. భార్యను చంపిన నిందితుడిని రోహిత్ కనిపెట్టాడా.. అసలు క్రిమినల్ లాయర్ అయిన జెబి ఎందుకు రోహిత్ ను టార్గెట్ చేశాడు లాంటి ప్రశ్నలకు సినిమా చూస్తే సమాధానం దొరుకుతుంది.
నటీనటుల ప్రతిభ :
నారా రోహిత్ ఎప్పటిలానే తన ఎనర్జీ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాలో కొన్ని డైలాగ్స్ రోహిత్ బాగా చేశాడు. ఇక క్రిమినల్ లాయర్ గా జగపతి బాబు మరోసారి అదరగొట్టాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మాములుగా ఉండదు. హీరోయిన్ దర్షన బానిక్ మంచి నటన కనబరించింది. జీవా, తులసి, సత్యం రాజేష్ పాత్రలు ఆకట్టుకున్నాయి.
సాంకేతికవర్గం పనితీరు :
సినిమా చాలా తక్కువ లొకేషన్స్ లో షూట్ చేశారని తెలుస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. సాయి కార్తిక్ మ్యూజిక్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హెల్ప్ అయ్యింది. కథ, కథనాలు దర్శకుడు పరుచూరి మురళి అంత గ్రిప్పింగ్ గా రాసుకోలేదు. కథనం ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది. అయితే కేవలం ఈ జానర్ సినిమాలను చూసే ఆడియెన్స్ కు నచ్చేలా ఉంటుంది. వాసిరెడ్డి రవింద్ర సినిమాకు మంచి బడ్జెట్ ఇచ్చారు.
విశ్లేషణ :
క్రైం థ్రిల్లర్ కథలకు ఎప్పుడైనా మంచి డిమాండ్ ఉంటుంది. సినిమా కథనం బాగా రాసుకుంటే అవి కూడా ప్రేక్షకులకు నచ్చేస్తాయి. అయితే ఈ సినిమా కథ పర్వాలేదు అనిపించినా కథనంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సినిమా కథ, కథనాల్లో దర్శకుడి పరుచూరి మురళి ప్రతిభ కనబడినా ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెడితే బాగుండేదనిపిస్తుంది.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కాస్త ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ మళ్లీ రొటీన్ గా సాగుతుంది. సినిమా మంచి సీరియస్ నోట్ తో మొదలవుతుంది. సినిమా మీద ఆడియెన్స్ ఇంట్రెస్ట్ పెంచుకున్నా మధ్యలో దారి తప్పేలా చేస్తుంది. సినిమా నారా రోహిత్ మార్క్ మూవీగా అనిపించినా ప్రేక్షకులను మాత్రం అలరించడం కష్టమే.
ప్లస్ పాయింట్స్ :
రోహిత్, జేబి
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
స్లో నరేషన్
మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
బాటం లైన్ :
‘ఆటగాళ్లు’ ఆట సరిగా ఆడలేదు..!
రేటింగ్ : 2.5/5