యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి మొదటిసారి చేస్తున్న సినిమా అరవింద సమేత. అసలైతే దసరాకి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా మరో 20 రోజుల షూటింగ్ ఉంది. ఇలాంటి టైంలో ఎన్.టి.ఆర్ తండ్రి హరికృష్ణ మరణించడంతో ఎన్.టి.ఆర్ షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది.
తన జీవితంలో తల్లిదండ్రులు తర్వాతే ఎవరైనా అని భావించే ఎన్.టి.ఆర్ ఈరోజు తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నాడు. కళ్యాణ్ రాం కూడా తండ్రి మరణంపై నోట మాటరానంత షాక్ లో ఉన్నాడు. ఈ టైంలో షూటింగ్స్ చేయడం కష్టం కనుక దసరా బరి నుండి అరవింద సమేత సినిమా వైదొలగినట్టే అని తెలుస్తుంది.
ఎన్.టి.ఆర్ సినిమా సైడ్ ఇస్తే రిలీజ్ చేసేందుకు చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. అరవింద సమేత మాత్రమే కాదు రాజమౌళితో చేసే మల్టీస్టారర్ సినిమా కూడా పోస్ట్ పోన్ చేస్తారని తెలుస్తుంది.