టెక్నికల్ అప్డేట్స్ కారణమగా సోషల్ యాక్టివిటీస్ బాగా జోరందుకున్నాయి. ముఖ్యంగా మన డేటాతో ఇతరలు లబ్ధి పొందడం, అసాంఘిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఈమధ్య మనం చూస్తూనే ఉన్నాం. జస్ట్ సిమ్ కార్డ్ కోసం ఇచ్చే ఆధార్ జిరాక్స్ మనల్ని రిస్క్ లో పడేలా చేస్తుంది.
ఇంతకీ విషయం ఏంటి అంటే ఇటీవలే నకిలి వేలిముద్రలు, ఆధార్ కార్డులతో అక్రమంగా సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన ఓ సెల్ యజమాని గుట్టు రట్టయ్యింది. దానితో ఇప్పుడు మొబైల్ యూజర్స్ అంతా కంగారు పడుతున్నారు. మన ఆధార్ నెంబర్ తో మన సిమ్ మాత్రమే తీసుకున్నాం అన్న అపోహలో మనం ఉంటాం కాని సెల్ షాప్ వాడు ఆ ఆధార్ తో ఇంకెన్ని సిమ్ లు తీసుకున్నాడో మనకి తెలియదు అందుకే టెలికం సంస్థలు కూడా వీటికి తరుణోపాయం ఆలోచించాయి.
ఇప్పటికే కస్టమర్ వేలిముద్ర లేనిదే సిమ్ కార్డ్ ఇవ్వట్లేదు. ఇక మన ఆధార్ నెంబర్ తో ఎన్ని సిమ్ లు తీసుకున్నామో టెలికాం సంస్థలు ఒక్క మెసేజ్ తో సమాచారం ఇస్తున్నాయి. ఎయిర్ టెల్, జియో, బి.ఎస్.ఎన్.ఎల్ ఈ సర్వీసెస్ ను ఇస్తున్నాయి. త్వరలోనే మిగతా టెలికాం సంస్థలు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా కార్యచరణ చేస్తున్నారు.
ఒక ఆధార్ మీద ఎన్ని సిం లు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
1. ఎయిర్టెల్ యూజర్స్ అయితే మీఫోన్ నుండి ADCHK స్పేస్ ఆధార్‌కార్డు నెంబర్ టైప్ చేసి 121కి సెండ్ చేయాలి. వెంటనే మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన నెంబర్ల లిస్ట్ వస్తుంది.
2. జియో యూజర్స్ అయితే మై జియో యాప్‌లో, మై అకౌంట్లో లింక్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. అలా లేకపోతే మీ పేరు మీద మరో జియో సిమ్ ఉన్నట్లే లెక్క.
3. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే ALIST స్పేస్ ఆధార్ నెంబర్ టైప్ చేసి 53734 అనే నెంబర్‌కు మెసేజ్ చేయాలి. అలా మెసేజ్ చేసిన వెంటనే ఆధార్ కార్డుతో ఉన్న బీఎస్ఎన్ఎల్ నంబర్లు వస్తాయి.