క్యారక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన ఆహుతి ప్రసాద్ అర్ధాంతరంగా మరణించిన సంగతి తెలిసిందే. 1958 జనవరి 2న జన్మించిన ఆయన 2015 జనవరి 4న మరణించడం జరిగింది. కోడూరు నుండి వచ్చిన ఆయన చిన్ననాటి నుండి ఎన్.టి.ఆర్ కు పెద్ద అభిమాని అవడం వల్ల ఆయన స్పూర్తితో సినిమాల్లోకి వచ్చారు. మధు ఫిల్మ్ ఇన్స్ ట్యూట్ లో నటనా శిక్షణ తీసుకుని ఆ తర్వాత దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్ ఇంచార్జ్ గా కూడా చేశారు.
ఆహుతి సినిమాతో ఆయనకు మంచి పేరు రావడం వల్ల ఆయన స్క్రీన్ నేం ఆహుతి ప్రసాద్ అయ్యింది. ఇక కెరియర్ లో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న టైంలో కృష్ణ వంశీ నిన్నే పెళ్లడతా సినిమా ద్వారా మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమాతో ఆహుతి ప్రసాద్ మళ్లీ ఫాంలోకి వచ్చారు. చందమామ సినిమాలో ఆయన కామెడీ యాంగిల్ కూడా నచ్చి ఆ తర్వాత అదే తరహా పాత్రల్లో మెప్పించారు.
ఆహుతి ప్రసాద్ చనిపోయి 3 ఏళ్లు అవుతుంది. అయితే ఆయన చనిపోయింది స్కిన్ క్యాన్సర్ వల్ల అని తెలిసింది. స్కిన్ క్యాన్సర్ ను గుర్తించని ఆయన డాక్టర్స్ కూడా సారీ చెప్పడంతో చివరి దశలో తన సొంతూరు అయిన కోడూరులోనే జీవితం గడిపారు ఆహుతి ప్రసాద్. సీరియస్ కండీషన్స్ లో హైదరాబాద్ వచ్చినా అప్పటికే ఆయన ప్రాణం గాల్లో కలిసి పోయింది. అతనికి ఉన్న వ్యాధి గురించి ఎవరి దగ్గరా ప్రస్థావించలేదట. అంతేకాదు అతన్ని కలవడానికి ఎవరు వచ్చినా సరే కలవొద్దని పంపించాడట. ఆయన జీవితం అలా ముగియడం ప్రేక్షకులను శోకసముద్రంలో ముంచింది.