Gossipsఅక్కినేని కోడలికి కొబ్బరికాయ కష్టాలు..!

అక్కినేని కోడలికి కొబ్బరికాయ కష్టాలు..!

అక్కినేని నయా కోడలు సమంతకు కొబ్బరి కష్టాలు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా కెరియర్ కొనసాగిస్తున్న సమంత లేటెస్ట్ గా తన రియల్ లైఫ్ పార్ట్ నర్ నాగ చైతన్యతో జోడి కట్టెందుకు సిద్ధమైంది. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలను జరుపుకుంది.

అయితే ఈ సందర్భంగా చిత్రయూనిట్ అందరు కొబ్బరికాయలు కొట్టగా సమంత మాత్రం కొబ్బారికాయ కొట్టేందుకు తెగ కష్టపడింది. ఇక ఆమె కష్టాన్ని చూసి అయ్యగారే ఆ కొబ్బరికాయను కొట్టారు. ఫిట్ నెస్ లో పర్ఫెక్ట్ గా ఉండే సమంత ఇలా కొబ్బరికాయ కొట్టకపోవడం నిజంగానే షాకింగ్ గా అనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. సమంత పెళ్ళైన తర్వాత మరింత సుకుమారంగా అయ్యిందని అక్కడ ఉన్న వారు మాట్లాడుకోవటం విశేషం. దానికి స్పందించిన సమంత తాను సినిమా ముహుర్తాలకు వెళ్లకపోవడంలో ఇది కూడా ఓ కారణమని చెప్పింది. అమ్మడు మరీ ఇంత సుకుమారమా అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news