బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్దె కలిసి నటించిన సినిమా సాక్ష్యం. శ్రీవాస్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా నిర్మించడం జరిగింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
దుబాయ్ లో ఉన్న ఉన్న వైభవ్ (బెల్లంకొండ శ్రీనివాస్) అక్కడ సంధ్య (పూజా హెగ్దె)ని చూసి ఇష్టపడతాడు. ఆమె ప్రేమలో పడిన వైభవ్ ఆమె ఇండియాకు వస్తే ఆమెనే ఫాలో అవుతూ ఇండియాకు వస్తాడు. ఆమె కోసం వచ్చిన అతనికి ప్రకృతి సూచనల ద్వారా తన గతం గుర్తుకొస్తుంది. అంతేకాదు తన ఫ్యామిలీని నాశనం చేసిన వారి గురించి తెలిసేలా చేస్తుంది. ఎవిల్ టీం వల్ల తన కుటుంబం నాశనం అయ్యిందని తెలుసుకున్న వైభవ్ వారిని ఏం చేశాడు అన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
వైభవ్ గా శ్రీనివాస్ నటన ఓకే అనిపిస్తుంది. అయితే సినిమాకు కావాల్సిన ఎమోషనల్ సీన్స్ లో మాత్రం అతని తేలగొట్టేశాడు. ఫైట్స్ వరకు బాగున్నాయి. డ్యాన్స్ లు పర్ఫెక్ట్ గా చేశాడు. ఇక పూజా హెగ్దెని ఎలా వాడుకోవాలో అలా వాడేశారు. యూత్ లో ఆమెకి ఉన్న ఫాలోయింగ్ ను బట్టి సినిమాలో గ్లామర్ షోతో ఆకట్టుకునేలా చేశారు. శరత్ కుమార్, మీనాలు బాగానే చేశారు. ఎవిల్ టీం గా జగపతి బాబు, అశుతోష్ రానా, రవి కిషన్ ఎప్పటిలానే విలన్స్ గా అదరగొట్టారు. వెన్నెల కిశోర్ కామెడీ ఇంప్రెస్ చేసింది.
సాంకేతికవర్గం పనితీరు :
ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. హర్షవర్దన్ రామేశ్వర్ ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. శ్రీవాస్ రాసుకున్న కథన్ ప్రకృతి మీద ఆధారపడి ఉండటం అక్కడక్కడ కొన్ని లాజిక్కులు మిస్ అయ్యాయని చెప్పొచ్చు. దర్శకుడిగా పాస్ అయినా కథను తెరకెక్కించడంలో సక్సెస్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయ్.
విశ్లేషణ :
తన తల్లిదండ్రులను చంపిన శత్రువుల గురించి ఏమాత్రం తెలియని హీరో ప్రకృతి సపోర్ట్ తో వారిని ఎలా కనిపెట్టి వారిని మట్టుపెట్టాడు అన్నది సినిమా కథ. కథగా అనుకుంటే బాగుంది అయితే ఏదైతే ప్రకృతి అంటూ హంగామా మొదలవుతుందో అక్కడ సినిమా ట్రాక్ తప్పుతుంది. సినిమాలో సిజి వర్క్ అంత గొప్పగా లేవు.
అంతేకాదు ఆ సీన్స్ కొన్ని ఇల్లాజిక్ అనిపిస్తాయి. దానికి తోడు ఎమోషనల్ సీన్స్ లో శ్రీనివాస్ నటన ఆడియెన్స్ కు మెప్పించలేదు. పూజా గ్లామర్ షో కాస్త రిఫ్రెష్ అనిపించినా కథ, కథనాలు ఏవి ప్రేక్షకులను కన్విన్స్ చేసేలా ఉండవు. మొదటి భాగం సరదాగా సాగినా సెకండ్ హాఫ్ ఆడియెన్స్ పేషెన్సీని టెస్ట్ చేస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
పూజా స్కిన్ షో
కెమెరా వర్క్
లొకేషన్స్
మైనస్ పాయింట్స్ :
మ్యూజిక్
స్క్రీన్ ప్లే
సిజి వర్క్
అక్కడక్కడ ల్యాగ్ అవడం
బాటం లైన్ :
బెల్లంకొండ నిరాశపరచాడు.. అతని నటనే ‘సాక్ష్యం’..!
రేటింగ్ : 2/5