బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్దె లీడ్ రోల్స్ గా వచ్చిన సినిమా సాక్ష్యం. శ్రీవాస్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో నామా అభిషేక్ నిర్మించారు. ఇప్పటివరకు కెరియర్ లో ఒక్క హిట్టు లేని బెల్లంకొండ మీద 40 కోట్లు పెట్టాడు నిర్మాత అభిషేక్. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పర్వాలేదు అనిపిచింది.
అయితే నిన్న మొదటి షో పడకపోవడం సినిమా కలక్షన్స్ మీద దెబ్బేసింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో 600 థియేటర్స్ లో రిలీజ్ అయిన సాక్ష్యం మూవీ 60% ఆక్యుపెన్సీ సాధించిందట. ఇక ఈ సినిమా మొదటి రోజు 5 కోట్ల దాకా వసూళు చేసిందని తెలుస్తుంది. కథ, కథనాలు పర్వాలేదు అనిపించగా బెల్లంకొండ నటన, ఫైట్స్, డ్యాన్స్ అలరించాయి.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్దెని తీసుకోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. డిజేలో బికినితో అలరించిన ఈ అమ్మడు సాక్ష్యంలో కూడా ఛాన్స్ ఉన్న చోట స్కిన్ షో చేసి ఇంప్రెస్ చేసింది. కలక్షన్స్ మీద పూజా ప్రభావం కూడా ఉందని చెప్పొచ్చు.