కొణిదెల వారసురాలిగా మెగా డాటర్ నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. రామరాజు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో నాగ శౌర్య, నిహారిక జంటగా నటించారు. ఆ సినిమా టైంలో ఈ ఇద్దరు ప్రేమించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అడపాదడపా ఆ వార్తలు వస్తున్నా వాటిని ఎవరు పట్టించుకోలేదు. ఈమధ్యనే ఈ విషయంపై అసలు జరిగిన మ్యాటర్ ఇదే అని కొందరు చెప్పుకుంటున్నారు.
ఒక మనసు సినిమా టైంలో నాగ శౌర్య, నిహారిక సీరియస్ గానే ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారట అయితే నాగ శౌర్య చౌదరి కావడం వల్ల నిహారిక కాపు కావడం వల్ల ఈ ఇద్దరి ప్రేమని పెద్దలు కాదన్నారట. చౌదరి, కాపుల మధ్య రాజకీయ కొట్లాటలు తెలిసిందే. కొన్నాళ్లుగా ఈ రెండు వర్గాల మధ్య నానా రచ్చ అవుతుంది.
అయితే మెగా ఫ్యామిలీ నుండి ఆల్రెడీ శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకుని నానా హంగామా చేసింది. అందుకే నిహారిక విషయంలో జాగ్రత్తపడ్డారట. ఈ విషయం మొత్తం చిరంజీవి దాకా వెళ్లకుండానే సెటిల్ చేశారని తెలుస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వార్తలు వాస్తవాలా లేక కల్పితాలా అన్నది చూడాలి.