Gossipsలిప్ లాక్ పై కీర్తి ఆరాటం..!

లిప్ లాక్ పై కీర్తి ఆరాటం..!

మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అందరికి తెలిసిందే. నేను శైలజతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అంతైకాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇస్తుండటంతో కీర్తి వెంట దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

అందం, అభినయం ఉన్న ఈ అమ్మడులో హాట్ యాంగిల్ మాత్రం ఎవరు చూడలేదు. అది కలే అంటుంది అమ్మడు. గ్లామర్ రోల్స్ కు తాను దూరమని చెబుతున్న కీర్తి కనీసం ముద్దు సీన్స్ కూడా తాను చేయలేనని అంటుంది. అదృష్టవశాత్తు తాను పనిచేసిన దర్శకులెవరు తనని అలాంటి సీన్స్ లో నటించాలని కోరలేదని అన్నది.

అంతేకాదు రొమాన్స్ అంటే తనకు సిగ్గని.. అందుకే ఒకవేళ అలాంటి కథలు తన దగ్గరకు వచ్చినా సారీ చెప్పేస్తానని అంటుంది కీర్తి. ఒకటి రెండు సినిమాలు హిట్ పడగానే ఆడియెన్స్ ను తమ అందాలతో మతులు పోగొట్టే భామలు ఉంటుండగా కీర్తి మాత్రం తాను ఇలానే ఉంటానని చెప్పడం గొప్ప విషయం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news