టాలీవుడ్ లో శ్రీరెడ్డి చేసిన డ్యామేజ్ సరిపోదు అన్నట్టు ఇప్పుడు కోలీవుడ్ మీద అమ్మడు దృష్టి పెట్టింది. రీసెంట్ గా శ్రీరెడ్డి రాఘవ లారెన్స్, హీరో శ్రీరాం మీద ఆరోపణలు చేసింది. అయితే దీనిపై వారు ఇప్పటివరకు స్పందించలేదు. కోలీవుడ్ లో మాత్రం శ్రీరెడ్డి వ్యాఖ్యలు హాట్ న్యూస్ గా మారాయి.
టి. రాజేందర్ లాంటి వారు శ్రీరెడ్డి వ్యాఖ్యలకు వారు స్పందించాల్సిందే అని అంటున్నారు. అయితే ఈ విషయంపై నడిఘర్ సంఘం ప్రెసిడెంట్ అయిన విశాల్ స్పందించారని తెలుస్తుంది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణల మీద నిజానిజాలను వెలికి తీసే క్రమంలో లారెన్స్, శ్రీరాం లతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారట. ఒకవేళ వారు చెప్పిన మాటలను బట్టి శ్రీరెడ్డి గేం ప్లాన్ లో భాగంగా ఈ కామెంట్స్ ఉంటే మాత్రం ఆమెకు చుక్కలు చూపించేందుకు సిద్ధ పడ్డాడట విశాల్. మరి పందెం కోడితో పెట్టుకున్న శ్రీరెడ్డి ఈసారి ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టుగా తన పరిస్థితి మారుతుందేమో జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.