ప్రకృతి లో ఉచితంగా లభించే మునగాకులో, మనం డబ్బులు పెట్టి కొనుక్కొనే ఏ ఒక్క ఆకు, కూరగాయలలో లేనటువంటి ఔషధ గుణాలు చాలా వున్నాయట, వాటిల్లో కొన్ని మీ కోసం
* ప్రతిరోజూ ఈ ఆకును తీసుకుంటే సాధారణంగ చీకట్లో కనిపించనటువంటి వస్తువులు కూడా కనిపిస్తాయట .
* ఈ ఆకులలో విటమిన్ A,విటమిన్ C, కాల్షియమ్, ఫాస్పరస్, ఐరన్, ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
* చిన్నపిల్లల్లో ఎముకలు బలంగా ఉండాలంటే పాలలో మునగాకు రసాన్ని కలిపి ఇస్తే బలంగా అవుతాయి.
* కీళ్ల నొప్పులతో బాధ పడే వారు మునగాకు నూరి నొప్పి వున్న చోట కట్టుకుంటే నొప్పులు తగ్గిపోతాయి.
* పాలు పెరుగు లో వుండే కాల్షియమ్ ప్రోటీన్ ల కన్నా మునగాకు లో 2 రేట్లు అధికంగా వున్నాయట.
* కాల్షియమ్ ఐరన్ తక్కువ స్థాయి లో వుంది అని బాధ పడే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మునగ ఆకు తీసుకోవటం వలన వారికీ పిల్లలకు మంచిది.
* మునగ ఆకు రసాన్ని ప్రతిరోజూ దోసకాయ రసం తో పాటు కలిపి తీసుకుంటే గుండె మరియు కిడ్నీ వ్యాధులు దూరం అవుతాయట.
* మునగ ఆకు రసాన్ని నిమ్మకాయ రసం తో కలిపి మొటిమల పైన రాసుకుంటే మచ్చలు తగ్గిపోతాయి.
* రాత్రి పడుకునే ముందు మునగ ఆకు రసాన్ని తేనే తో కలిపి తీసుకుంటే రేచీకటి తగ్గిపోతుంది.
* మునగ ఆకు ను ఆహారంగా తీసుకోవటం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
* తలనొప్పి కి మంచి ఒఔషదం గా పని చేస్తుందని చెప్తున్నారు వైద్యులు.
* కప్పు నీటిలో మునగ ఆకు ని వేసి వేడి చేసి ఆ నీటిని వడకట్టి దానిలో కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసం, మిరియాల పొడి కలుపుకుని తాగటం వలన TB, ఆస్తమా లాంటి జబ్బులు దరి చేరవంట.