ప్రముఖ సిని నటి సపోర్ట్ రోల్స్ చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అన్నపూర్ణ ఇంట్లో విషాదం నెలకొంది. అన్నపూర్ణ కూతురు కీర్తి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్య వల్ల భర్తకు దూరమైన కీర్తి కొన్నాళ్లుగా తల్లి అన్నపూర్ణ దగ్గరే ఉంటుందని సమాచారం. భర్తకు దూరంగా ఉండలేకనో లేక మరే కారణమో తెలియదు కాని ఆమె ఇంట్లోనే ఫ్యాన్స్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘనపై విచారం జరుపుతున్నారు. మూడేళ్ల క్రితమే బెంగళూరుకి చెందిన అబ్బాయిని పెళ్లాడిన కీర్తి జీవితం ఇలా విషాదాంతం అవడంతో అందరు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణమ్మను ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈ వయసులో కూతురు మరణం అన్నపూర్ణమ్మకు శోక సముద్రంలో ముంచింది.