అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియా లో మారుమ్రోగుతుంది. యూట్యూబ్ లో ఒక సంచలనం సృష్టించాడని చెప్పుకుంటున్నారు.అసలు దేనిగురించి అనుకుంటున్నారా బోయపాటి దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరో గ నటించిన చిత్రం సరైనోడు. ఈ సినిమా తెలుగు లో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఈ మూవీ హిందీ వెర్షన్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. సినిమాకి మంచి వ్యూస్ వచ్చాయి ఒక్క సంవత్సరం లో ఏకంగా రెండు వందల మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఈ వార్త విన్న నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు ఈ సినిమా కి ఇంత పాపులారిటీ ఉందా అని ఆశ్చర్యపోయారు. వాళ్ల మనసులో వున్నా ఎన్నో సందేహాల్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు.అసలు ఈ వ్యూస్ మొత్తం ఫేక్ అని చెబుతున్నారు.
అల్లు అర్జున్ మీద ఇలా ఆరోపణలు రావడం ఇదేం మొదటి సారి కాదు ట్విట్టర్ లో హైయెస్ట్ ఫాలోవర్స్ఉన్న వారి జాబితాలో అల్లు అర్జున్ వున్నాడు. వాటిలో 50% ఫేక్ అని ఒక్క ప్రముఖ వార్తాపత్రిక ఇటీవలే ప్రచురించింది. బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ ఇయినా సినిమాలకే అన్ని వ్యూస్ రాలేదు అల్లు అర్జున్ సినిమాకి ఎలా వచ్చాయి అని ప్రేశ్నిస్తున్నారు.వీటిలో మరో చమత్కారమైన విషయం ఏమిటంటే అన్ని వ్యూస్ వచ్చాయని వారికి సంబంధించిన బ్యానర్ వాళ్లే విడుదల చేసారు.దీని భట్టి అర్ధమవుతుంది అవి ఫేక్ వ్యూస్ ఆ లేదా ఒరిజినల్ గా వచ్చాయా అని.