ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీతో అదరగొట్టిన మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తీసుకొస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే ఈ సినిమాకు సైరా నరసింహారెడ్డి టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో యాక్షన్ పార్ట్ కు రెడీ అవుతుంది.
సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా రిలీజ్ 2019 సంక్రాంతికి అనుకోగా ఇప్పుడు అది సమ్మర్ కు పోస్ట్ పోన్ అయ్యిందని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే సైరాను హడావిడిగా చుట్టేయకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట. ముందు పొంగల్ వార్ లో దిగుగాదమని అనుకున్నా సమ్మర్ లో సినిమా హిట్ అయితే ఆ కలక్షన్స్ లెక్క వేరేలా ఉంటుందని భావించి సైరా సమ్మర్ కే తీసుకురావాలని డిసైడ్ అయ్యారట.
బిగ్ బీ అమితాబ్ తో పాటుగా జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.