Reviewsసుధీర్ బాబు , అదితి ల "సమ్మోహనం" సినిమా రివ్యూ రేటింగ్

సుధీర్ బాబు , అదితి ల “సమ్మోహనం” సినిమా రివ్యూ రేటింగ్

సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో వచ్చిన సినిమా సమ్మోహనం. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించింది. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

చైల్డ్ బుల్ రైటర్ అయిన విజయ్ (సుధీర్ బాబు) సినిమా వాళ్ల మీద ఓ నెగటివ్ ఆలోచనలతో ఉంటాడు. అనుకోకుండా తన తండ్రి వలన తన ఇంటిలోనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో హీరోయిన్ సమీరా (అదితి రావు హైదరి) అక్కడకు వస్తుంది. ఆమెకు అక్కడ సహాయం చేయడంతో దగ్గరవుతాడు విజయ్. విజయ్, సమీరా ప్రేమలో పడతాడు. కాని ఎందుకు ఆమె నో చెబుతుంది. సమీరా విజయ్ ను కాదనడానికి కారణాలేంటి..? ఆ తర్వాత సమీరాను విజయ్ ఎందుకు ద్వేషిస్తాడు..? ఇద్దరి ప్రేమ ఫలించిందా లేదా అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సుధీర్ బాబు విజయ్ పాత్రలో బాగా చేశాడు. మోహనకృష్ణ రాసుకున్న పాత్రకి సుధీర్ బాబు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. రీల్ హీరోయిన్ గా అదితి రావు హైదరి బాగా చేసింది. ఆమెకు తెలుగు స్ట్రైట్ సినిమా ఇదే అవడం విశేషం. నరేష్ యాక్టింగ్ బాగుంది. రెగ్యులర్ పాత్రే అయినా నరేష్ మెప్పించేశాడు. రాహుల్ రామకృష్ణ కామెడీ అలరించింది. మిగతా పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి.

సాంకేతికవర్గం పనితీరు :

పి.జి.విందా సినిమాటోగ్రఫీ బాగుంది. హీరో, హీరోయిన్ లను చాలా అందంగా చూపించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా అలరించింది. మెలోడీ మ్యూజిక్ తో వివేక్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ కథ, కథనాలు బాగున్నాయి. అక్కడక్క స్లో అయినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న డైరక్టర్స్ లో మోహనకృష్ణ ఇంద్రగంటి ఒకరు. గ్రహణం నుండి ఆమీ తుమీ వరకు ఆయన చేసిన సినిమాలన్ని ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అలానే సమ్మోహనం సినిమాతో ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ మీద కథ రాసుకున్నాడు.

ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది. ఇంద్రగంటి సినిమాలు స్లోగా ఆడియెన్స్ ను సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. మొదటి భాగం ఎంటర్టైన్ చేస్తూ రాగా.. సెకండ్ హాఫ్ కాస్త అటుఇటుగా ఉన్నా ఎంటర్టైన్ చేస్తుంది. ముఖ్యంగా సినిమాలో డైలాగ్స్, లీడ్ పెయిర్ కన్వర్జేషన్స్ బాగున్నాయి. సినిమా ద్వారా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలను ప్రస్థావించాడు ఇంద్రగంటి మోహనకృష్ణ.

కథ, కథనాలు ఆయన మార్క్ కనిపించేలా ఉన్నాయి. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా మనసుకి హత్తుకునేలా సినిమా ఉంది.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవడం

కమర్షియల్ అంశాలు లేకపోవడం

బాటం లైన్ :

సుధీర్ బాబు,అదితి లు సమ్మోహనపరిచారు..!

రేటింగ్ : 3.0 /5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news