Gossipsబిగ్ బాస్-2లో శ్రీరెడ్డి.. పచ్చగడ్డి వేసినా భగ్గుమంటది ఏం చేద్దాం నాని..!

బిగ్ బాస్-2లో శ్రీరెడ్డి.. పచ్చగడ్డి వేసినా భగ్గుమంటది ఏం చేద్దాం నాని..!

బిగ్ బాస్-2 మొదలవుతున్న ఈ తరుణంలో ఆ కంటెస్టంట్ లిస్ట్ లో శ్రీరెడ్డి కూడా ఉందని వార్తలొచ్చాయి. నాని హోస్ట్ గా రాబోతున్న ఈ రియాలిటీ షోలో ఈసారి బిగ్ హౌజ్ లో ఎవరు ఉండబోతున్నారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఫైనల్ లిస్ట్ ఇది అని బయటకు వస్తుండగా అది కాదని మరో లిస్ట్ రివీల్ చేస్తున్నారు.

అయితే లిస్ట్ లో ఒకరిద్దరు సభ్యులు తప్ప కొంతమంది మాత్రం పర్మినేంట్ అని తెలుస్తుంది. ఇక ఆ లిస్ట్ లో శ్రీరెడ్డి ఉందని తెలుస్తుంది. దీన్ని శ్రీరెడ్డి తనతంట తాను కన్ఫాం చేసింది. లేటెస్ట్ గా తన ట్విట్టర్ లో నానికి నాకు పచ్చ గడ్డి వేసినా భగ్గుమంటది.. కాని ఏం చేద్దాం నాని మరి అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూస్తే బిగ్ బాస్ సీజన్ 2లో శ్రీరెడ్డి ఉందనే అనిపిస్తుంది.

ఇక ఈసారి గేమ్ ప్లాన్ పూర్తిగా మార్చేస్తున్నారట. తప్పకుండా ఈసారి కూడా మొదటి సీజన్ లానే ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. జూన్ 10 నుండి స్టార్ మాలో బిగ్ బాస్ మొదలు కానుంది. ఈసారి ఈ షో 100 రోజులు దాకా ఉంటుందట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news