Gossipsబాలయ్య వద్దు.. చిరునే ముద్దు అంటున్న మెగా హీరో

బాలయ్య వద్దు.. చిరునే ముద్దు అంటున్న మెగా హీరో

ఈ మాట అంటుంది ఎవరో కాదు స్వయానా మెగా హీరోనే.. మెగా హీరో బాలయ్యను వద్దనడం ఏంటి.. మెగాస్టార్ ను ముద్దు అనడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న తేజ్ ఐలవ్యూ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 29న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. తేజూ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా కె.ఎస్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఆడియోకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. తేజ్ లాస్ట్ మూవీ ఇంటిలిజెంట్ సినిమా నుండి నందమూరి బాలకృష్ణ టీజర్ రిలీజ్ చేశారు. అప్పుడు బాలయ్య ముద్దు అయిన తేజూ మెగా హీరోలను ఆ సినిమా ప్రమోషన్స్ లో వాడలేదు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడేస్తున్నాడు.

మెగా మేనళ్లుడిగా వచ్చిన కొత్తలో జోష్ కనబరచిన సాయి ధరం తేజ్ తిక్క నుండి ఇంటిలిజెంట్ వరకు వరుస ఫ్లాపులే తీశాడు. మరి తేజూకి ఈ లవ్ స్టోరీ అయినా గట్టేక్కేలా చేస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news