Newsసుధీర్ ని పెళ్లిచేసుకోమంటూ రష్మీ కి నెటిజన్ సలహా .. అమ్మడి...

సుధీర్ ని పెళ్లిచేసుకోమంటూ రష్మీ కి నెటిజన్ సలహా .. అమ్మడి సమాధానం వింటే షాకే..!!

యాంకర్ రష్మీ , సుధీర్ ల జంట టీవీ షోలలో చేసే అల్లరి , హడావుడి మాములుగా ఉండదు. మొన్నామధ్య ఒక టీవీ ప్రోగ్రాములో వారిద్దరికీ నిజంగానే పెళ్లి అయినట్లు చూపించి చివరకు “తూచ్..” అనేశారు. ఢీ ప్రోగ్రాములో కానీ ఇటు జబర్దస్త్ ప్రోగ్రాములో కానీ వీరిద్దరిని ఫోకస్ చేస్తూ పంచ్ లు పడుతూ ఉంటాయి.

ఇటువంటి సందర్భంలో ఈ మధ్య ఒక నెటిజెన్ “రష్మి.. సుధీర్‌ను పెళ్లి చేసుకో. మీరిద్దరు ఒకరి కోసం మరొకరు పుట్టినట్లు ఉంటారు. ఇద్దరు కెరీర్‌ కోసం చాలా కష్టపడుతున్నారు” అని ఒక సలహా ఇచ్చారు. సాధారణంగే అయితే ఎప్పుడూ పెద్దగా స్పందించని రష్మీ తమపై వస్తున్న రూమర్లకు ఒకే సారి సమాధానం చెప్పాలనుకున్నట్లు కొంచెం ఘాటు గానే సమాధానమిచ్చింది.

ఆమె మాటల్లోనే “మమ్మల్ని తెరపై చూసి.. మేమిద్దరం ఒకరి కోసం మరొకరం పుట్టామని ఎలా అనుకుంటారు. రియల్ లైఫ్ నుంచి రీల్‌ లైఫ్‌ను వేరు చేయడం నేర్చుకోండి. మేం తెరపై చేసేదంతా ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం మాత్రమే. మేం ఎవర్ని పెళ్లి చేసుకోవాలి అనేది మా నిర్ణయం, సలహాలు అవసరం లేదు”

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news