టాలీవుడ్ క్రేజీ లవ్ కపుల్ నాగ చైతన్య, సమంతలు లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమపక్ష్లుగా ఉన్న వీరు తమ కుటుంబాలను ఒప్పించి పెళ్లాడారు. వారి ప్రేమ పెళ్లి టాలీవుడ్ క్రేజియెస్ట్ వెడ్డింగ్ గా మారింది. అంతేకాదు మ్యారేజ్ అయ్యి సంవత్సరం అయ్యేందుకు దగ్గరకొస్తుండగా ఇంకా ఆ వీడియోలు అందరిని అలరిస్తున్నాయి.
టాలీవుడ్ ప్రముఖులంతా చైతు, సమంత మ్యారేజ్ లో పాటిస్పేట్ చేశారు. ఇక ఈ పెళ్లికి సంబందించిన ఓ వీడియో క్లిప్ రిలీజ్ చేసింది సమంత. ఎందుకు ఏమిటి అన్నది తెలియదు కాని క్రేజీ కపుల్స్ పెళ్లాడిన విధానం చూస్తే ముచ్చటేస్తుంది. ఇక ఈ వీడియో నా.. టై ఎక్కడ అంటూ నాగ చైతన్య అడగడటం నుండి సమంత చైతుని డామినేట్ చేస్తూ తలంబ్రాలు పోసే దాకా ఉంది.
చూస్తుంటే సమంత, చైతులలో సమంతదే పైచేయి అన్నట్టుగా ఉంది. అక్కినేని కుటుంబంతా ఈ వీడియోలో కనిపించారు. ఏడాది కావొస్తున్నా వారి పెళ్లి ఈవెంట్ గురించి సమంత చేసిన ట్వీట్ చూసి అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.