సక్సెస్ ఫుల్ డైరక్టర్ క్రిష్ తన భార్య రమ్యతో విడిపోయేందుకు సిద్ధపడ్డాడని వార్తలు వచ్చాయి. క్రిష్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా కెరియర్ కొనసాగిస్తున్నాడు. అతని భార్య కూడా డాక్టర్ గా చాలా గొప్ప పేరు సంపాదించింది. అయితే వృత్తి పరమైన గొడవల వల్లే కలిసి ఉండటం కుదరట్లేదని ఇద్దరు విడిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాని అసలు విషయం వేరే ఉందట.
క్రిష్ ఓ హాట్ హీరోయిన్ వల్లో పడ్డాడట. తన సినిమాతోనే లైం లైట్ లోకి వచ్చిన ఆ అమ్మడితో ముంబైలో డేటింగ్ చేస్తున్నాడట. కెరియర్ లో సరైన క్రేజ్ కోసం ఎదురుచూస్తున్న అమ్మడు టైం పాస్ గా ఈ దర్శకుడితో సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తుందట. ఈ విషయం క్రిష్ భార్య దాకా వెళ్లడంతో ఇద్దరు విడిపోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం క్రిష్ మణికర్ణిక సినిమా చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. సినిమాతో ఎలాంటి సంబంధం లేని ఈ హీరోయిన్ అక్కడ కనిపించడంతో రూమర్స్ కు రెక్కలొచ్చాయి. మరి ఈ విషయంపై ఆ హీరోయిన్ కాని.. క్రిష్ కాని ఎలా స్పందిస్తారో చూడాలి.