సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కాలా. కబాలి తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాను రజిని అల్లుడు ధనుష్ నిర్మించారు. మొదటి నుండి వివాదాలతో వచ్చిన ఈ సినిమా కర్ణాటకలో కొన్ని ఏరియాల్లో రిలీజ్ కూడా అవ్వలేదు. ఈ ఎఫెక్ట్ సినిమా కలక్షన్స్ మీద పడింది.
మొదటి రోజు ఫైనల్ కలక్షన్స్ రిపోర్ట్ ఇంకా రాలేదు. అయితే చెన్నైలో మాత్రం 1.76 కోట్లతో కాలా తమిళనాట మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. చెన్నై సిటీలో రజినికి మించిన హీరో లేడని ఈ కలక్షన్స్ ప్రూవ్ చేశాయి. విజయ్ మెర్సల్ సినిమా 1.52 కోట్లతో రికార్డ్ సృష్టించగా కాలా దాన్ని బీట్ చేసింది.
కబాలి కన్నా బెటర్ టాక్ తెచ్చుకున్న కాలా సరైన ప్రమోషన్స్ చేసి ఉంటే మంచి వసూళ్లనే రాబట్టి ఉండేది. రజిని మార్క్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో రజినికాంత్ తో పాటుగా విలన్ గా నటించిన నానా పటేకర్ కూడా అద్భుంతమైన నటనతో ఆకట్టుకున్నాడు.