సూపర్ స్టార్ రజినికాంత్, పా. రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కాలా. కబాలి తర్వాత రజిని మళ్లీ రంజిత్ కే అవకాశం ఇవ్వడం హాట్ న్యూస్ అయ్యింది. అయితే కబాలి అంచనాలను అందుకోకున్నా కాలా మాత్రం కచ్చితంగా రికార్డులు సృష్టిస్తుందని అనుకున్నారు. కాని కాలా పరిస్థితి కూడా అలానే ఉంది.
తమిళనాడులో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం కాలా పరిస్థితి మరి దారుణంగా ఉందని చెప్పాలి. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన కాలా 4 రోజుల్లో కేవలం 6.41 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈ సినిమా కన్నా కబాలి ఎక్కువ వసూళ్లను రాబట్టింది. కాలా సినిమా తెలుగు ఆడియెన్స్ ను ఏమాత్రం థ్రిల్ చేయలేకపోయింది.
చూస్తుంటే కాలా కూడా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు లాసులు మిగిల్చేలా ఉంది. ఏరియాల వారిగా కాలా కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం : 2.55 కోట్లు
సీడెడ్ : 0.98 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.60 కోట్లు
ఈస్ట్ : 0.46 కోట్లు
వెస్ట్ : 0.36 కోట్లు
గుంటూరు : 0.72 కోట్లు
కృష్ణా : 0.49 కోట్లు
నెల్లూరు : 0.25 కోట్లు
ఏపి/తెలంగాణా : 6.41 కోట్లు