అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుమంత్ ఇన్నాళ్లకు ట్రాక్ లో పడ్డాడని చెప్పొచ్చు. ఈమధ్యనే మళ్లీ రావా సినిమాతో హిట్ అందుకున్న సుమంత్ ఆ జోష్ తోనే ఇదం జగత్ సినిమా చేస్తున్నాడు. అనీల్ శ్రీకంఠం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది.
ఈ ఫస్ట్ లుక్ చూసే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పొచ్చు. సినిమాపై అంచనాలు పెంచేలా ఈ ఫస్ట్ లుక్ ఉందని చెప్పొచ్చు. జొన్నలగడ్డ పద్మావతి, గంగరత్నం శ్రీధర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. భరత్ డైరక్షన్ లో వచ్చిన మళ్లీరావా సినిమా సుమంత్ కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. ఫస్ట్ లుక్ అదరగొట్టగా సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎక్సైటింగ్ గా ఉన్నారు.