బుల్లితెరపై వస్తున్న ‘జబర్దస్త్’ కామెడీ ప్రోగ్రాంలో పేరు సంపాదించుకున్న చాలా మంది యాక్టర్స్ వెండితెరపై తమ ట్యాలెంట్‌ను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. వీరిలో చమ్మక్ చంద్ర, వేణు, రాఘవ వంటి వారు పాపులర్. అయితే ఇటీవల జబర్దస్త్ అంటే హైపర్ ఆది.. హైపర్ ఆది అంటే జబర్దస్త్ అనే రేంజ్‌లో తన పంచులతో ఈ కామెడీ షోను ఏలుతున్నాడు ఈ కమెడియన్. కేవలం జబర్దస్త్‌లోనే కాకుండా వివిధ కార్యక్రమాల్లో తన సత్తా చాటుతూ నాన్-స్టాప్ నవ్వులు పంచుతున్నాడు ఆది. ఇటీవల అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘మేడ మీద అబ్బాయి’ చిత్రంలో నటించి మెప్పించాడు ఆది.
అయితే తాజాగా ఆది లీడ్ రోల్ చేస్తున్న ‘ఆటగదరాశివ’ అనే సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో టైటిల్‌ను హైలైట్ చేస్తూ ఇతర నటీనటులెవ్వరీ రివీల్ చేయలేదు దర్శకుడు. ఈ సినిమాను చంద్ర సిద్ధార్థ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి సెన్సేషనల్ సినిమాలను డైరెక్ట్ చేసిన సిద్ధార్ధ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సినీ వర్గాల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాక్‌లైన్ వెంకటేష్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఒకప్పుడు బడా చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన ఈయన వాటి ఫెయిల్యూర్స్ కారణంగా ఇప్పుడు చిన్నసినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి హైపర్ ఆది ఈ సినిమాతో వెండితెరపై ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.