దేవి సినిమాతో మ్యూజిక్ డైరక్టర్ గా అరంగేట్రం చేసిన దేవి శ్రీ ప్రసాద్ ఆ సినిమా నుండి ఇప్పటివరకు కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకున్నది లేదని చెప్పొచ్చు. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా 19 ఏళ్ల పాటు టాప్ మ్యూజిక్ డైరక్టర్ గా కెరియర్ కొనసాగిస్తున్నాడు డిఎస్పి. అయితే స్టార్ రేంజ్ పెరిగినట్టు ఈ మ్యూజిక్ డైరక్టర్ క్రేజ్ కూడా పెరిగింది.
దేవి మ్యూజిక్ అంటే సినిమా సగం హిట్ అన్నట్టే. అందుకే రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్ లోనే చెబుతున్నాడట దేవి. ఓ సినిమాకు 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట డిఎస్పి. అంతేకాదు చిన్న సినిమాలకు ఈమధ్య అసలు టైం ఇవ్వట్లేదని తెలుస్తుంది. చేతినిండా స్టార్ సినిమాలు ఉంటే ఇక చిన్న సినిమాలతో పని ఏముంటుంది.
అంతేకాదు కొత్త దర్శకుడైతే దేవి కాస్త టెక్కు చూపిస్తాడని టాక్. ఆల్టర్నేట్ గా తమన్ ఉన్నా దేవి చేసినట్టుగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడు. అయితే సక్సెస్ రేటు పోలిస్తే తమన్ దేవి కన్నా వెనుకపడి ఉన్నాడు. మరి రెమ్యునరేషన్ లెక్కలు ఎలా ఉన్నా చిన్న సినిమాలకు మ్యూజిక్ అందించేలా డిఎస్పి ప్లాన్ చేసుకుంటే బెటర్.