Newsరానాకు ఆపరేషన్.. ఆందోళనలో అభిమానులు!

రానాకు ఆపరేషన్.. ఆందోళనలో అభిమానులు!

టాలీవుడ్ హల్క్ దగ్గుభాటి రానా భల్లాలదేవ పాత్రతో ఎలాంటి గుర్తింపు సాధించాడో అందరికీ తెలిసిందే. ఒకేఒక్క సినిమాతో ప్రత్యేక గుర్తింపును సాధించాడు. మొదట హీరోగా పరిచయం అయినా కూడా భల్లాలదేవ పాత్రతో ఇండస్ట్రీకి ఒక సరికొత్త విలన్ దొరికాడని సంతోషం వ్యక్తం చేశారు ప్రేక్షకులు. అంతలా ఆ సినిమాతో మెస్మరైజ్ చేసిన రానా, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

అయితే ఇలాంటి రానాకు సంబంధించి ఒక విషయం చాలా తక్కువమందికి తెలుసు. రానాకు చిన్నతనం నుంచి ఒక కన్ను కనిపించదు. ఆ కంటికి అప్పట్లో ఆపరేషన్ చేశారు. అయితే అది పూర్తిగా సక్సెస్ కాలేదు. దీంతో ఇంతకాలం ఎలాగోలా నెట్టుకొచ్చిన రానా, ఇప్పుడు తన కంటికి సంబంధించి పూర్తి తరహా ట్రీట్‌మెంట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దీనికోసం ఫారిన్ వెళ్లి అక్కడ కంటి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు రానా. నిజానికి రానాకు ఎప్పుడో ఆపరేషన్ జరగాల్సి ఉంది. కానీ అతడికి హైబీపీ ఉండంతో డాక్టర్లు ఆపరేషన్ చేసేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఫారిన్‌లో తన కంటి ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం హాతీ మేరే సాతీ అనే సినిమాలో నటిస్తున్న రానా, ఆ తరువాత టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో నటిస్తాడు. ఇలా వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెట్టిన రానా కంటి ఆపరేషన్ కోసం వెళుతున్నాడనే వార్త ఇండస్ట్రీలో వ్యాపించడంతో అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసుకుని తిరిగిరావాలని వారు కోరుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news