మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నర సింహారెడ్డి మూవీపై నేషనల్ మీడియా దృష్టి పెట్టింది. ఖైది నంబర్ 150 తర్వాత చిరంజీవి చేస్తున్న ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారట.
40 మంది ఫారిన్ ఫైటర్స్ తో చిరు ఈ ఫైట్ సీక్వెన్సెస్ లో పాల్గొంటున్నాడని తెలుస్తుంది. అర్ధరాత్రి కాదు దాదాపు తెల్లవారుఝామున 3 గంటల వరకు షూటింగ్ పాల్గొంటున్నాడట చిరంజీవి. అంతదాకా ఉన్నా సరే చిరులో ఏమాత్రం ఎనర్జీ డ్రాప్ అవ్వట్లేదట. మిగతా చిత్రయూనిట్ అంతా డీలా పడిపోతుంటే చిరు మాత్రం అంతే స్టామినాతో ఉంటున్నాడట.
ఎలాగైనా సరే అనుకున్న టైం కల్లా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మొదట 2019 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేయగా ఇప్పుడు సమ్మర్ కు సైరా రిలీజ్ డిసైడ్ చేశారట.