రిలియాలిటీ షోలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న బిగ్ బాస్ తెలుగులో రెండో సీజన్ కు సిద్ధమైంది. ఆదివారం గ్రాండ్ గా ఈ షో మొదలైంది. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా ఈ సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా చేస్తున్నాడు. జూన్ 10న మొదలైన ఈ షో కేవలం ఇండియా ప్రేక్షకులు మాత్రమే చూశారు.
యూఎస్ లో ఈ షో ప్రసారం కాలేదట. యుప్ టివి లైవ్, మా టివి లైవ్ ఇవేవి యూఎస్ లో పనిచేయలేదు. టైమింగ్స్ మార్పు వల్ల యూఎస్ లో ఈ షో ప్రసారం కాలేదని తెలుస్తుంది. బిగ్ బాస్ లైవ్ కాకుండా అక్కడి ప్రేక్షకులు రికార్డెడ్ వర్షన్ మాత్రమే చూసే అవకాశం ఉందట. ఇది బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికి చేదు వార్తే.
మొదటి రోజే బిగ్ బాస్ కు ఇలాంటి షాక్ తగలడం నిర్వాహకులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఎన్.టి.ఆర్ ప్లేస్ లో నాని సోసోగానే అనిపిస్తున్న ఈ టైంలో ఈ షో అక్కడ టెలికాస్ట్ కాకపోవడం మరింత ఇరకాటంలో పడేస్తుంది. మరి దీనికి స్టార్ మా నిర్వాహకులు ఎలాంటి తరుణోపాయం చేస్తారో చూడాలి.