కాస్టింగ్ కౌచ్ పై శ్రీ రెడ్డి చేసిన పోరాటంలో కొంతమేర సక్సెస్ అయినట్టేనని తెలిసిందే. మధ్యలో మ్యాటర్ పవన్ మీదకు వెళ్లడంతో వ్యవహారం హీటెక్కింది. ఎలాగోలా ఇండస్ట్రీ పెద్దలు ఈ ఇష్యూని క్లోజ్ చేశారు. అంతేకాదు ఓ స్పెషల్ టీం ను ఏర్పాటుచేశారు. శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ పై చేసిన యుద్ధంలో నటి అపూర్వ కూడా కొంత సపోర్ట్ అందించింది.
ఇండస్ట్రీ నుండి శ్రీ రెడ్డికి సపోర్ట్ గా నిలిచింది కూడా అపూర్వానే. ఇక తనకు జరిగిన కొన్ని సంఘటనల గురించి చెబుతూ ఆమె భూమిక మీద క్రేజీ కామెంట్స్ చేసింది. అమ్మాయిలు ఎక్కడ ఉన్నా ఆత్మ విశ్వాసం, గౌరవం కోల్పోకూడదు. అలాంటి వారిలో హీరోయిన్ భూమిక మొదటి స్థానంలో ఉంటారు. ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అనవసరమైన విషయాల గురించి మాట్లాడరు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తారు. హీరోలు కూడా అనవసరంగా ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించరని అపూర్వ అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ కు ఉన్న సహనం మరెవరికి లేదని అంటుంది అపూర్వ. ప్రజా జీవితంలో ఉన్న వారికి ఇది చాలా అవసరం. శ్రీ రెడ్డి తన తల్లిని తిట్టినా సరే పవన్ మాత్రం సహనం కోల్పోలేదని అన్నారు. ఆయన అసలు క్యారక్టర్ కూడా అదేనని.. ఆయన ఫ్యాన్స్ కూడా ఆయనలాగా ఉంటే ఇంకా మంచిదని అన్నారు.